టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో సూపర్ 12 దశకు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. గ్రూప్ ‘1’లోని ఆరు జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. గ్రూప్ ‘2’లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. నవంబర్ 6న జరిగే భారత్, జింబాబ్వే మ్యాచ్ తో సూపర్ 12 దశకు తెర పడనుంది. సూపర్ 12 దశ ఆఖరి దశకు చేరుకున్నా ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా సెమీఫైనల్ కు అర్హత సాధించలేదు.