టీ20 వరల్డ్ కప్ 2022(T20 World Cup 2022) లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ను, బంగ్లా వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఇండియా కేవలం 5 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని జట్టు గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ఈ ఓటమిని బంగ్లా జట్టు జీర్ణించుకోలేకపోతోంది.
అయితే ఈ మ్యాచ్‌లో ఒక వివాదం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. విరాట్ కోహ్లీ (Virat ఫేక్ త్రో ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనికి భారత్‌కు జరిమానా విధించాల్సి ఉండాలని బంగ్లా జట్టు ఆరోపిస్తోంది. ICC నియమావళి ప్రకారం.. బ్యాట్స్‌మెన్ దృష్టిని ఉద్దేశపూర్వకంగా మరల్చకూడదు. అందుకు ఐదు పరుగులు పెనాల్టీగా ఇస్తారు. ఇదే బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్‌లో జరిగి ఉంటే మ్యాచ్ టైగా ముగిసేదని వారు వాదిస్తున్నారు. దీన్ని పట్టుకుని మన టీమిండియా మీద పడి ఏడుస్తున్నారు బంగ్లా అభిమానులు, వారి ఆటగాళ్లు.
* అసలేం జరిగింది? : మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో.. లిట్టన్ దాస్ ఆఫ్ డీప్ ఆఫ్-సైడ్ ఫీల్డ్ వైపు బాల్ ఆడాడు. ఆ బాల్‌ను అర్ష్‌దీప్ సింగ్, బౌలర్ ఎండ్ వైపు త్రో చేశాడు. పాయింట్ వద్ద నిలబడిన కోహ్లి బాల్‌ను అందుకుని వికెట్ల వైపు విసురుతున్నట్లు నటించాడు. వాస్తవానికి బాల్ కోహ్లి చేతిలో లేదు.
బాల్ కోహ్లీని దాటి బౌలర్ ఎండ్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ఫీల్డ్‌లోని అంపైర్లు మరైస్ ఎరాస్మస్, క్రిస్ బ్రౌన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో ఎండ్‌లో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇక్కడ వాళ్ల ఆటగాళ్లు కూడా ఫిర్యాదు చేయకపోవడాన్ని ఆ దేశ అభిమానులు గుర్తించుకోవాలి.
ఇండియా ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లీ తీరుపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు హసన్ మహ్మద్ తన ఓవర్లో రెండు బౌన్సర్లను బౌల్ చేసినట్లు కోహ్లీ.. అంపైర్ ఎరాస్మస్ వైపు నో-బాల్‌ను సూచించాడు. అంపైర్ కూడా అంగీకరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అవాక్కయ్యాడు. కోహ్లీ తీరుపై స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.