టీ20 ప్రపంచకప్ 2022 (T20 World cup 2022) టోర్నమెంట్లో భాగంగా నవంబర్ 10 (నేడు)న అడిలైడ్ ఓవల్‌లో భారత్ (India), ఇంగ్లాండ్ (England) మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, రెండు జట్లలో ఆటను క్షణాల్లో మార్చగల ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇంగ్లండ్ జట్టులో ఈ ముగ్గురితోనే టీమిండియాకు యమ డేంజర్. వాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
అలెక్స్ హేల్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేదు. ఆ తర్వాత అదిరిపోయే ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌పై 52, శ్రీలంకపై 47 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 ఏళ్ల హేల్స్ ఒక దూకుడైన బ్యాట్‌మెన్. ఎప్పుడైనా తన గేర్ మార్చగలరు. భారీ షాట్లు ఆడడంలో దిట్ట. హేల్స్ ఓపెనర్‌గా 137 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. పేస్, స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలడు. (AP)
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు సవాళ్లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. సవాళ్లు ఎదురైనప్పుడల్లా వాటి సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. బెన్ స్టోక్స్లోని ఈ గుణం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో స్టోక్స్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రాలేదు. అయితే.. బంతి, బ్యాట్ తో ఎప్పుడైనా సరే ఆటను క్షణాల్లో మార్చగలడు. (AP)