ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022) హోరాహోరీగా సాగుతోంది. ఒక వర్షం అంతరాయం కలిగిస్తుంది అన్న బాధ తప్ప.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచులు ఫ్యాన్స్ కు కావాల్సినంత మజాని అందించాయి. ఇక, ఈ టోర్నీలో ఏ జట్టు హాట్ ఫేవరేట్ అని చెప్పడానికి లేదు. ప్రతి జట్టు కూడా విజయం కోసం ఆఖరి వరకూ పోరాడుతున్నాయి.
సూపర్ 12లో.. ఐర్లాండ్ జట్టు సంచలనాన్ని నమోదు చేసింది. 11 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐరీష్ జట్టు.. టీ20 మెగాటోర్నీలో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.మెల్బోర్న్లో జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ ఓడించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
క్వాలిఫయర్స్‌లో నికోలస్ పూరన్ నేతృత్వంలోని వెస్టిండీస్ మరోసారి ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 సార్లు ఓడిన వెస్టిండీస్ జట్టు క్వాలిఫయింగ్ రౌండ్ నుంచి నిష్క్రమించింది. దీంతో, క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టు వెస్టిండీస్.
సూపర్ 12 రౌండ్‌లోని మొదటి మ్యాచ్ కూడా ఇదే విధమైన షాకింగ్ ఫలితాన్ని అందించింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. గత 12 ఏళ్లలో న్యూజిలాండ్ కేవలం 2 సార్లు మాత్రమే ఆసీసన్ ను ఓడించింది. అది కూడా 2011లో.. మళ్లీ ఈ ప్రపంచకప్‌లో. సూపర్ -12 ఫస్ట్ మ్యాచులో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.