క్రికెట్ లవర్స్ కు అలరించడానికి మరో మహా సంగ్రామం రెడీ అయింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభంకానుంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్-12కు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో.. భారత్(T20 world cup india team), ఇంగ్లాండ్ (England), ఆస్ట్రేలియా (Australia), దక్షిణాఫ్రికా (South Africa), వెస్టిండీస్ (West Indies), పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్ ఉన్నాయి.
ఇక, టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India T20 World Cup Squad).. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో, నవంబర్ 5న రౌండ్ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.
టోర్నీ ప్రారంభం సందర్భంగా విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. " ధోని తిరిగి డ్రెస్సింగ్ రూమ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. తన కొత్త పాత్రను పోషించడానికి అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మేమంతా కెరీర్లు ఆరంభించిన దశలో ధోని మాకు మెంటార్ గా (Mentor) పాత్ర పోషించాడు. ఇదే అవకాశం యువ ఆటగాళ్లకు కూడా లభించనుంది. ధోని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది " అని అన్నాడు.
ఇంకా కోహ్లి మాట్లాడుతూ.. " ధోని ఏ జట్టులో నాయకత్వ పాత్రను పోషించినా అతడు తేడాను చూపుతాడు. ఫీల్డ్ లో అతడు మాతో ఉండటం మాకు కలిసొచ్చేదే. ధోని కచ్చితంగా ఈ జట్టు ధైర్యాన్ని పెంచుతాడు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడు మాకు సలహాలిస్తాడు. ధోని మాతో ఉన్నాడన్న మాటే మాకు కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తున్నది. ఈసారి కప్ కొడతామనే ధీమా ఉంది " అని వివరించాడు.
ఇక గత రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ గురించి మాట్లాడుతూ.. " 2016లో మేం టోర్నీ నుంచి నిష్క్రమించడం నిరాశపరిచింది. ఆ టోర్నీలో వెస్టిండీస్ అద్భుతంగా ఆడింది. విజయానికి వాళ్లు పూర్తి స్థాయిలో అర్హులు. ఇక 2014 శ్రీలంకతో ఫైనల్స్ లో మేం ఓడిపోవడంతో చాలా మందితో పాటు నాకు విచారకరం. అది మాకు చాలా గుణపాఠాలు నేర్పింది " అని తెలిపాడు.