నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీ (T-20 World Cup 2021) లో ఇదే తొలి మ్యాచ్.
దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. అయితే, పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతుంటే మరోవైపు ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ రద్దు చేయాలని నెటిజన్లు, పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
" ప్రస్తుతం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ ఆగడాలను అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి. పాక్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత ప్రభుత్వం, ప్రధాని భావిస్తున్నప్పటికీ.. వారి ఉగ్ర చర్యలు ఆగడంలేదు. ఆ దేశంపై అంతిమ యుద్ధం ప్రకటించాలి. ప్రస్తుతం పాక్‌తో టీ20 మ్యాచ్‌ను నిలిపివేయాలి. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తా" అని పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాయాదీ దేశంతో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నిరాకరించాలని ఆప్ మహిళా ఎమ్మెల్యే అతిషీ కోరారు. భారత్‌లో పాక్ ఉగ్రదాడులు ఆగిపోయేంతవరకు ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడకూడదని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన డిమాండ్‌కు మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతుంటే ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ ఆడుతారా? అని ఒవైసీ నిలదీశారు. ‘జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో భారత్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?' అని ఒవైసీ ప్రశ్నించారు.
గతకొన్ని రోజులుగా కశ్మీర్లో సాధారణ ప్రజలపై ఉగ్రదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది. అలాగే, మన సైనికుల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు.