ప్రస్తుతం టీమిండియా (Team India).. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో (Virat Kohli) టీ -20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup 2021) ఆడుతోంది. ఈ మెగా టోర్నీ తర్వాత.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఇప్పటికే ఈ విషయమై కోహ్లీ ప్రకటన కూడా చేశాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్గా కూడా తప్పుకోనున్నాడు. దీంతో కెప్టెన్ గా ఆఖరి ధనాధన్ టోర్నీలో రెచ్చిపోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విల్లూరుతున్నాడు.