టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021 )లో సూపర్ 12 స్టేజ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్ 1, గ్రూప్ 2ల నుంచి ఏ జట్లు సెమీస్కు చేరుకుంటుందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారత్ ఉన్న గ్రూప్ 2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్లు నెగ్గి సెమీస్కు బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక రెండో స్థానం కోసం న్యూజిలాండ్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.
మరోవైపు, న్యూజిలాండ్ కూడా నమీబియాను చిత్తు చేసి పాయింట్ల టేబుల్ లో రెండో స్ధానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ అఫ్గాన్ మీద గెలిస్తే డైరక్ట్ గా సెమీస్ లోకి అడుగుపెడుతోంది. కానీ, ఓడితే.. అప్పుడు కివీస్, టీమిండియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఎవరికైతే మెరుగైన రన్ రేట్ ఉంటుందో ఆ జట్టు సెమీస్ లోకి అడుగుపెడుతోంది.