టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) లో టీమిండియా మరో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాల్ని దెబ్బతీసుకుంది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది ఈ ఓటమితో టీమిండియా సెమీస్ కు వెళ్లడం కష్టమే. అయితే, కొన్ని అద్భుతాలు జరిగితే టీమిండియా సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక గాలిలో దీపం మాత్రమే.
టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల పోరులో రెండు మ్యాచ్‌లు గెలిచే జట్టు సెమీస్ రేసులో ముందంజ వేస్తుంది. ఇప్పుడు మన టీమిండియా ఓడిపోవడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయ్. అయితే, అలా కాకుండా ఒకదానిపై గెలిచి.. మరో జట్టు చేతిలో ఓడితే మూడు జట్లు ఒక్కొక్కటి గెలిచినట్టు అవుతుంది. అప్పుడు నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది.