Super Over Combinations: టీ20 వరల్డ్ కప్‌లో..సూపర్‌ ఓవర్‌ వస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగేది వీరే! అన్ని జట్లపై స్పెషల్ ఫోకస్..

Super Over Combinations: క్రికెట్‌లో టీ 20 అంటేనే ఉత్కంఠ. టీ 20 అంటే ఉత్సాహం. టీ 20 అంటే ఉద్వేగం. ఈ మూడు కలగలిపి ఒకేసారి వచ్చే సందర్భం సూపర్‌ ఓవర్‌. ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాక.. విజేతను నిర్ణయించేందుకు సూపర్‌ ఓవర్‌ ఆడిస్తుంటారు. ఈ సందర్భం ఎప్పుడో కానీ రాదు. కానీ వచ్చిందంటే... ఆ సందడి మామూలుగా ఉండదు. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ ఓవర్‌ వస్తే ఏ జట్టు ఎవరిని బరిలోకి దింపుతుందో ఓ అంచనాగా చూద్దాం!