టీ20 వరల్డ్కప్ 2021 (T20 World Cup 2021) మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. టాప్ టీమ్స్ తో పాటు చిన్న జట్లు కూడా తగ్గేదే లే అన్నట్లు పోరాడుతున్నాయ్. దీంతో, గ్రూప్ 1లో కంటే.. గ్రూప్ 2లో సెమీస్ రేసు రసవత్తరంగా ఉంది. అఫ్గానిస్థాన్ (Afghanistan) పై విజయంతో గ్రూప్ 2 టేబుల్ టాపర్గా ఉన్న పాకిస్థాన్ దాదాపు సెమీస్కు చేరినట్లే.
టీ20 ప్రపంచకప్ 2021లో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఒక దానితో మరొకటి పోటీ పడలేదు. భారత్ ఆదివారం న్యూజిలాండ్తో తలపడనుంది. అఫ్గానిస్థాన్తో నవంబర్ 3న కోహ్లీసేన తలపడనుంది. నవంబర్ 7న కివీస్, అఫ్గాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచుల తర్వాతే సెమీస్ చేరే జట్లపై పూర్తి స్పష్టత రానుంది.