యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది.
ముస్తాక్ మాట్లాడుతూ.. " ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరుకుంటే అది గొప్ప విషయం. ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మరోసారి తలపడాలని నేనూ కోరుకుంటున్నాను. ఇదివరకే ఒకసారి మేము వాళ్లను ఓడించామని కాదు గానీ వారు (టీమిండియా) చాలా బలమైన జట్టుగా ఉన్నారు. అంతేగాక ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్ అని అంతా భావిస్తున్నారు " అని అన్నాడు.
టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లను కూడా తాము బలమైన జట్లుగానే భావిస్తున్నామని ముస్తాక్ అన్నాడు. కానీ ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా తమ ఆట తాము ఆడుతామని స్పష్టం చేశాడు. ఇక ప్రత్యర్థి ఎవరైనా మ్యాచ్ కు ముందు తాము అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలుచేయడమే తమ గేమ్ ప్లాన్ అని ముస్తాక్ తెలిపాడు.