శుక్రవారం జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉండటంతో పాక్ జట్టు సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అటు బ్యాట్, ఇటు కెప్టెన్సీతో పాక్ విజయాల్లో బాబర్ అజామ్ (Babar Azam) కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బద్దలు కొట్టాడు.
అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో బాబర్ అజామ్ (51; 47 బంతుల్లో 4x4) అర్ధ శతకంతో మెరిశాడు. దీంతో, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 26 ఇన్నింగ్స్‌లలో టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 1000 పరుగులు ఫాస్ట్ గా పూర్తిచేసుకున్న తొలి కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు.
శ్రీలంక లెజండ్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు అందుకోవడం విశేషం. ఈ లిస్ట్ లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82), బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (83) ఇన్నింగ్స్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. అఫ్గాన్ తరఫున రషీద్ ఖాన్ 53 టీ20లు ఆడి 101 వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్లు రెండుసార్లు.. నాలుగు వికెట్లు నాలుగుసార్లు పడగొట్టాడు.
రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇదివరకు రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2018లో రషీద్ 44 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అందరి కన్నా తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు స్పిన్ మాంత్రికుడు.