ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే.ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో, ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ సాగడం ఖాయం. మరోవైపు, ఐసీసీ టోర్నీల్లో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ కు ఓటమే లేదు.
ఇక, ఈ మెగాటోర్నీలో టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మెంటార్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, మెగాటోర్నీకి ముందు ప్రకటించిన జట్టులో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ (Axar Patel) ని స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసి.. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ను జట్టులోకి తీసుకువచ్చారు.
ఐపీఎల్ 2021 సీజన్లో బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యాను భారత సెలెక్టర్లు పక్కనపెట్టాలని భావించారంట.. కానీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీనే పట్టుపట్టి మరీ అతన్ని జట్టులో ఉండేలా చేశాడంట. ఫినిషర్‌గా పాండ్యా జట్టులో ఉండటం కీలకమని మహీ సూచించడంతో సెలెక్టర్లు అతన్ని కొనసాగించారని టైమ్స్ ఇండియా పేర్కొంది.