టీ20 వరల్డ్ కప్ (ICC T-20 World CuP 2021) లో భాగంగా భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చెత్త రికార్డును చెరిపేయడానికి పాక్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు PCB బంపరాఫర్ ప్రకటించింది. టీ20లో భారత్‌పై గెలిస్తే.. ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఓ పారిశ్రామికవేత్త తనకు హామీ ఇచ్చినట్లు రమీజ్ వెల్లడించారు.
ఇప్పటికే.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్తాన్ పై.. భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఈ సారి బాబర్ అజాం నేతృత్వంలోని పాకిస్తాన్.. ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.. టీమిండియాను కచ్చితంగా ఓడిస్తామని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.