టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఏకైక జట్టు పాకిస్తాన్ (Pakistan). గ్రూప్ 2లోని ఇండియా (India), న్యూజీలాండ్ (New Zealand) వంటి బలమైన జట్లను ఓడించి.. ఒక్క పరాజయం నమోదు చేయకుండా సెమీస్ చేరింది. అయితే, సెమీస్ లో ఆస్ట్రేలియా ముందు తలవంచక తప్పలేదు.
అయితే, హసన్ అలీ ఈ క్యాచ్ డ్రాప్ చేయడంపై సోషల్ మీడియాలో అతడిపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే చాలా దారుణంగా అతడిని ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ఓడిపోయిన తర్వాత భారత బౌలర్ మహ్మద్ షమిపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో.. అంతకంటే దారుణంగా హసన్ అలీని తిడుతూ పోస్టులు పెడుతున్నారు.