అక్టోబర్ 17 న ప్రారంభమైన టీ-20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ప్రేక్షుకుల్ని ఆకట్టుకుంటోంది. క్వాలిఫైయిర్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు బోలెడంత మజా అందిస్తున్నాయ్. ఇక, అసలు టోర్నీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. సాధారణంగా టీ-20 ఫార్మాట్ అంటేనే పరుగుల వరద. ఈ ధనాధన్ ఫార్మాట్ లో బ్యాటర్లు రెచ్చిపోవడం కామన్. ఇక, మెగా టోర్నీ ప్రపంచకప్ ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
విరాట్ కోహ్లీ (2012-2016) : ఇక, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకే అన్నట్టుగా ఉంటుంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్. టీమిండియా కెప్టెన్ వరల్డ్ కప్ కేవలం 16 మ్యాచ్ లాడి 777 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక, ఈ ఏడాది కూడా రెచ్చిపోతే.. మరిన్ని రికార్డులు కోహ్లీ సొంతమవుతాయ్. మెగాటోర్నీల్లో కోహ్లీ యావరేజ్ 86.33 గా ఉంది.