3విజయాలు, 2ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించి ఫ్యాన్స్ ను నిరాశలో పడేసింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ ను ఓడించలేకపోవడంతో టీమిండియాకు ఈ దుస్థితి ఏర్పడింది. అయితే, కోహ్లీసేన క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటి బాట పట్టడంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్వర్క్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో భారీగా నష్టపోయింది.
అయితే, ఓ నివేదిక ప్రకారం టీమిండియా టోర్నీ నుంచి ముందుగానే వైదొలగడం వల్ల స్టార్ ఇండియా 15-20% కోల్పోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే వెనుకకు తీరగడంతో ఆ తర్వాత చూసే వీక్షకుల సంఖ్య తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య పెరిగిన అది అంతగా ఉండకపోవచ్చు అని ఆ నివేదిక వెల్లడించింది.