T20 WORLD CUP 2021 BIG SHOCK TO PAKISTAN TEAM MOHAMMAD RIZWAN AND SHOAIB MALIK MISSED PAKISTANS TRAINING SESSION WITH MILD FLU BEFORE THEIR SEMI FINAL WITH AUSTRALIA SRD
Pak Vs Aus : కీలక పోరుకు ముందు పాకిస్థాన్ కు భారీ షాక్.. అయోమయంలో బాబర్ సేన..
Pak Vs Aus : ఈ కీలక పోరులో సర్వశక్తులు ఒడ్డేందుకు పాకిస్థాన్, ఆస్ట్రేలియా (Pakistan Vs Australia) రెండు జట్లు రెడీ అయ్యాయ్. అయితే, ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ లో ఉన్న పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. దీంతో, బాబర్ సేన అయోమయంలో పడింది.
క్రికెట్ లవర్స్ ను ఎంతగానో అలరించిన టీ-20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup 2021) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ సెమీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది న్యూజిలాండ్ టీమ్. ఇక, రెండో సెమీస్ లో అజేయ పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
2/ 7
ఈ కీలక పోరులో సర్వశక్తులు ఒడ్డేందుకు పాకిస్థాన్, ఆస్ట్రేలియా (Pakistan Vs Australia) రెండు జట్లు రెడీ అయ్యాయ్. అయితే, ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ లో ఉన్న పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. దీంతో, బాబర్ సేన అయోమయంలో పడింది.
3/ 7
వివరాల్లోకెళితే.. ఫ్లూ కారణంగా సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ ప్రాక్టీస్‌కు రాలేదు. వారిద్దరికీ కొవిడ్-19 నెగిటివ్ అని తేలింది. స్టార్ క్రికెటర్లు ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు.
4/ 7
గురువారం ఉదయం వైద్య పరీక్షల తర్వాత వారు ఆడతారో లేదో అన్నది తుది నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 పోటీల్లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పోరుకు షోయబ్ మాలిక్, మహ్మద్ రిజ్వాన్‌లు ఇద్దరూ దూరమయ్యే అవకాశం ఉంది.
5/ 7
రిజ్వాన్, మాలిక్ ఇద్దరూ పాకిస్థాన్ బ్యాటింగ్ యూనిట్లో కీలకమైన భాగం. ముఖ్యంగా అటాకింగ్ ఓపెనర్ రిజ్వాన్ ప్రపంచ కప్‌లో ఐదు గేమ్‌లలో 214 పరుగులు చేశాడు. మరోవైపు షోయబ్ మాలిక్ ఈ టోర్నమెంట్లో వివిధ దశల్లో మెరుగైన ఆట ప్రదర్శించాడు.
6/ 7
మిడిలార్డర్ లో మాలిక్ కీలకమైన పరుగులు చేశాడు. అతను స్కాట్లాండ్పై కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు.తమ కీలక బ్యాటర్లు ఇద్దరూ ఫైనల్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటారని పాకిస్థాన్ భావిస్తోంది. మాలిక్, రిజ్వాన్‌ల స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలు జట్టులో చేరవచ్చు.
7/ 7
ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ మాత్రమే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. ఇదే దూకుడుతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.