ఆటకు దూరమైనా అతనిచ్చే సలహాలు ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఉపయోగంగా మారుతాయి. అందుకేనేమో.. ఎలాగైనా 2021 టీ 20 ప్రపంచకప్ కొట్టాలని భావించిన టీమిండియా ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేసింది.ప్రస్తుతం రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ రూపంలో టీమిండియాకు మంచి సహాయక సిబ్బంది ఉండగా.. ధోనీని ఎందుకు టీమిండియాతో చేర్చారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అంతే కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించిన అనుభవం దృష్ట్యా ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యమైన ఐసీసీ టోర్నమెంట్లను గెలవడానికి ఎలా ప్లాన్ చేయాలో ధోనికి బాగా తెలుసు. ధోనీ కెప్టెన్సీలో తొలి టీ 20 ప్రపంచకప్‌ని భారత్ గెలచుకుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు.