ఐపీఎల్ 2021 సీజన్ మరో ఐదు రోజుల్లో యుగియనుంది. దీంతో అందరి దృష్టి టీ-20 వరల్డ్ కప్ పై పడింది. పురుషుల టీ20 వరల్డ్ కప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి.అయితే, తుది జట్టులో మార్పుల కోసం అక్టోబర్ 10 వరకు సమయం ఇచ్చింది. దీంతో బీసీసీఐ టీమ్ ఇండియాలో కూడ పలు మార్పులు చేయడానికి నిర్ణయించుకుంది.
అదే జరిగితే కోల్‌కతా తరఫున అదరగొడుతున్న ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ సెకండాఫ్‌లో జట్టులోకి వచ్చిన అయ్యర్ 7 మ్యాచ్‌ల్లో 239 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. అయితే పెద్దగా అనుభవం లేకపోవడం ఈ యువ క్రికెటర్‌కు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది.
భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ ఐపీఎల్లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ స్నిన్నర్ రాహుల్ చాహర్.. శ్రీలంక పర్యటనలోను సత్తా చాటాడు. ఆ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. కానీ యూఏఈ వేదికగా సెకండాఫ్‌లో దారుణంగా విఫలయ్యాడు. సెకండాఫ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ చాహర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు.
మరో వైపు యుజ్వేంద్ర చాహల్ యూఏఈ గడ్డపై దుమ్మురేపాడు. ఏడు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముంబైపై(3/11), పంజాబ్ కింగ్స్(3/29)పై మూడేసి వికెట్లతో చెలరేగాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. తన ఆటతోనే సెలెక్టర్లు, విమర్శకులకు బదులిచ్చాడు. దీంతో.. రాహుల్ చాహర్ స్థానంలో చాహల్‌ను తీసుకోవడం ఖాయమైనట్లు తెలుస్తోంది.