Arjun Tendulkar : దాంతో ఈ ఏడాది సచిన్ ముంబైని వదిలి గోవాకు వెళ్లాడు. గోవా కోసం జరిగిన ట్రయిల్స్ లో పాల్గొని ఆ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటుతున్నాడు.
జట్టు మారిన తర్వాత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడి రాత మారినట్టుంది. ముంబై తరఫున ఉంటూ వస్తోన్నా ఒక్కసారి కూడా అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)కు బరిలోకి దిగే అవకాశం రాలేదు.
2/ 8
దాంతో ఈ ఏడాది సచిన్ ముంబైని వదిలి గోవాకు వెళ్లాడు. గోవా కోసం జరిగిన ట్రయిల్స్ లో పాల్గొని ఆ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటుతున్నాడు.
3/ 8
హైదరాబాద్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అర్జున్.. 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అయితే ఆ మ్యాచ్ లో గోవా జట్టు గెలవలేకపోయింది. ఇక తర్వాత పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ 2 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
4/ 8
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా గోవా ఓడిపోయింది. అయితే అర్జున్ టెండూల్కర్ మాత్రం వ్యక్తిగతంగా అందరినీ మెప్పించాడు. ఇక తాజాగా ఉత్తర్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి తన మ్యాజిక్ స్పెల్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
5/ 8
ఉత్తర్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. అర్జున్ కు మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
6/ 8
ఇక అనంతరం ఛేదనకు దిగిన యూపీని అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్లోనే దెబ్బ తీశాడు. ఓపెనర్, కెప్టెన్ కరణ్ శర్మ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత యూపీని రింకూ సింగ్, సమీర్ చౌదరీలు ఆదుకున్నారు.
7/ 8
ఈ సమయంలో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన అర్జున్ కీలకమైన సమీర్ చౌదరి వికెట్ ను తీసి గోవాకు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో గోవా 11 పరుగుల తేడాతో నెగ్గింది. 4 ఓవర్లు వేసిన అర్జున్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. (PC : BCCI Domestic)
8/ 8
మొన్నటి వరకు ఆల్ రౌండర్ గా ఉన్న అర్జున్ ఇప్పుడు పూర్తిగా బౌలింగ్ పై శ్రద్ధ పెట్టాడు. మంచి పేస్ తో బంతులను వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అర్జున్ ఇదే రీతిలో ఇంప్రూవ్ అవుతూ వెళితే ఏదో ఒక రోజు టీమిండియాలో బౌలర్ గా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. (PC : BCCI Domestic)