* శుభమాన్ గిల్ : ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో తాజా సంచలనం శుభ్‌మాన్ గిల్. 23 ఏళ్ల గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై తన తొలి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ బాదాడు. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తన మొదటి అంతర్జాతీయ శతకం సాధించాడు.
గత నెలలో తన మొదటి ODI సెంచరీ కొట్టాడు. గిల్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో కనిపించనున్నాడు. కేఎల్ రాహుల్ కూడా జట్టులో ఉన్నందున గిల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. నాగ్‌పూర్‌లో ప్రారంభ టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ సందేహాస్పదంగా ఉండటంతో గిల్ మిడిల్ ఆర్డర్ స్లాట్ కోసం కూడా పోటీలో ఉండవచ్చు.
* విరాట్ కోహ్లి : విరాట్ గతేడాది ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తొలి T20I సెంచరీని సాధించాడు. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ జాబితాలో చేరిపోయాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత్ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు టెస్టులు, వన్డేలలో 70 సెంచరీలు చేసిన కోహ్లి.. టీ20లో సెంచరీ కొట్టలేకపోయాడు.
* కేఎల్ రాహుల్ : 2016లో వెస్టిండీస్‌పై KL రాహుల్ T20I సెంచరీ కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో వంద కొట్టిన లిస్ట్‌లో చేరిన మూడో ప్లేయర్ అయ్యాడు. రాహుల్ 2018లో ఇంగ్లండ్‌పై టీ20లలో మరో సెంచరీ సాధించాడు. మొత్తం మీద 30 ఏళ్ల రాహుల్ ఖాతాలో 12 ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు.