ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలం (Mega Auction)లో 600 మంది ప్లేయర్లు (Players) తమ పేర్లను రిజస్టర్ చేసుకోగా... అందులో 204 మంది ప్లేయర్లు అమ్ముడయ్యారు. మిగిలిన వారు అన్‌సోల్డ్‌గా మిగిలారు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన వారిలో స్టార్ ప్లేయర్లు సైతం ఉన్నారు. వారు ఉత్త స్టార్స్యే కాదు ఐపీఎల్లో తమ జట్లకు ఒకానొక సమయంలో అత్యుత్తమ ప్లేయర్లుగా ఉన్నారు. ఈ కేటగిరీలోకే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ ప్లేయర్ సురేశ్ రైనా (Suresh Raina) వస్తాడు.
ఆ సంవత్సరం టోర్నీ ప్రారంభం కాకుండానే అతను ఇండియాకు తిరిగొచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశాడు. అలా ఎందుకు తిరిగొచ్చాడనే అంశాన్ని పక్కనపెడితే దీంతో రైనా సీఎస్కేతోపాటు అన్ని జట్ల నమ్మకాన్ని కోల్పోయాడని చెప్పాడు. అలాగే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నమ్మకాన్ని కూడా రైనా కోల్పోయాడని సైమన్ డౌల్ తెలిపాడు.
మరోవైపు, సురేష్ రైనా కోల్పోవడంతో తిరిగి జట్టులో తీసుకోలేదని శ్రీనివాసన్ చెప్పినట్టు సైమన్ డౌల్ గుర్తు చేశాడు. ఫామ్ కారణంగా ఓ ఆటగాడిని ఏదైనా జట్టు పక్కనబెడితే..మరో జట్టు ఆ ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయదని వివరించాడు. ఇదే కారణంతో సురేష్ రైనాను సీఎస్కేతో పాటు మరే ఇతర జట్టు కొనుగోలు చేయలేదని చెప్పాడు.