ఐదు వరుస విజయాల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓడటం సన్ రైజర్స్ కే చెల్లింది. సన్ రైజర్స్ గతంలో నిలకడగా ఆడిందంటే అందుకు కారణం జట్టు ఓపెనర్లు. బెయిర్ స్టో, డేవిడ వార్నర్ లు సన్ రైజర్స్ బ్యాటింగ్ భారాన్ని కొన్నేళ్ల పాటు మోశారు. అయితే ఈ సీజన్ లో కొత్త ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ సక్సెస్ కాలేదు.