SRH : వేలంలో సన్ రైజర్స్ అదుర్స్.. సూపర్ స్ట్రాంగ్ గా టీం.. వచ్చే సీజన్ లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ ఇదేనా!
SRH : వేలంలో సన్ రైజర్స్ అదుర్స్.. సూపర్ స్ట్రాంగ్ గా టీం.. వచ్చే సీజన్ లో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్ ఇదేనా!
SRH : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ముందు వెనుక చూసుకోకుండా ప్లేయర్లను కొని మూల్యం చెల్లించుకుంది. ఇక కేన్ విలియమ్సన్ ను రీటెయిన్ చేసుకుంటే అతడి వల్ల జట్టుకు ఏ విధంగా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైంది.
2/ 9
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ముందు వెనుక చూసుకోకుండా ప్లేయర్లను కొని మూల్యం చెల్లించుకుంది. ఇక కేన్ విలియమ్సన్ ను రీటెయిన్ చేసుకుంటే అతడి వల్ల జట్టుకు ఏ విధంగా ఉపయోగం లేకుండా పోయింది.
3/ 9
2022 ఐపీఎల్ నుంచి గుణ పాఠాలను నేర్చుకున్న కావ్య మారన్ అండ్ కో ప్రక్షాళనకు నడుం బిగించింది. జట్టుకు భారంగా మారిన చాలా మంది ప్లేయర్లను వదిలించుకుంది.
4/ 9
మినీ వేలంలో మరోసారి కావ్య మారన్ ఎలా పడితే అలా కొనుగోలు చేస్తుందేమో అని అభిమానులు భయపడ్డారు. అయితే మినీ వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయడంలో సన్ రైజర్స్ ఆచి తూచి అడుగేసింది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి తనకు అవసరం అయిన ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసింది.
5/ 9
మినీ వేలం కంటే ముందు సన్ రైజర్స్ పలు విభాగాల్లో బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్.. ఫినిషర్.. స్పిన్ విభాగాల్లో చాలా వీక్ గా ఉంది. మినీ వేలం ద్వారా ఈ బలహీనతలను సన్ రైజర్స్ సరి చేసుకుంది.
6/ 9
హ్యరీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ లను కొనుగోలు చేసి మిడిలార్డర్ ను బలంగా చేసింది. వీరిద్దరూ మ్యాచ్ లను ఫినిష్ చేయడంలో కూడా ముందుంటారు. ఇక మయాంక్ అగర్వాలన్ ను కొని ఓపెనింగ్ సమస్యకు చెక్ పెట్టింది.
7/ 9
ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కెప్టెన్ గా ఉన్న మయాంక్ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ మయాంక్ ను కొనుగోలు చేయడం జట్టుకు మంచిదనే చెప్పాలి. ఇక రషీద్ ఖాన్ వెళ్లిపోయిన తర్వాత స్పిన్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఆదిల్ రషీద్ లాంటి మణికట్టు స్పిన్నర్ ను తీసుకుని స్పిన్ ను కూడా బలంగా మార్చుకుంది.
8/ 9
నికోలస్ పూరన్ ను విడుదల చేయడంతో టీంకు వికెట్ కీపర్ లోటు ఏర్పడింది. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అయితే వేలంలో క్లాసెన్ తో పాటు నితీశ్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్ లను కొనుగోలు చేసింది. జట్టులో ఇప్పటికి నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు.
9/ 9
2023 సీజన్ లో సన్ రైజర్స్ ప్లేయింగ్ ఎలెవెన్ (అంచనా) : అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, బ్రూక్స్, గ్లెన్ ఫిలిప్స్/క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్