కేన్ విలియమ్సన్ వెళ్లిపోవడంతో పంజాబ్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో ఓడిపోయింది. దాంతో సీజన్లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 6 గేమ్స్ లో గెలిచి 8 మ్యాచ్ ల్లో ఓడి 12 పాయింట్లతో లీగ్ టేబుల్ లో 8వ స్థానంలో నిలిచింది.