అలాగే, ప్రస్తుతం టీమిండియాలో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం ముగ్గురు నుంచి నలుగురు వరకు పోటీపడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ స్థానానికే గ్యారెంటీ లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జట్టులో స్ధానం నిలుపుకోవాలంటే కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.