ఐపీఎల్ 2023 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భాగం కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021లో చివరిసారిగా ఆడిన స్మిత్.. తర్వాతి రెండు సీజన్ల కోసం జరిగిన వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. వేలం ముగిసిన తర్వాత అతను పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్లో సెంచరీల మోత మోగించాడు. భారత్తో టెస్ట్, వన్డే సిరీస్లో విఫలమైన కెప్టెన్గా ఆకట్టుకున్నాడు.
తాజాగా ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసిన స్మిత్.. తాను ఐపీఎల్ 2023లో భాగమవుతున్నానని తెలిపాడు. 'నమస్తే ఇండియా. నేను మీతో ఒక వార్తను పంచుకోబోతున్నాను. ఐపీఎల్ 2023 బరిలోకి దిగబోతున్నాను. అవును.. మీరు విన్నది నిజమే.. నేను ఒక గొప్ప టీంతో జాయిన్ అవుతున్నా’ అంటూ వీడియోను ముగించాడు. (PC : Steve Smith/Twitter)
అయితే ఈసారి మాత్రం డిజిటల్ ప్రసారాలను వయాకామ్ 18కు చెందిన జియో సినిమా చేయనుంది. దాంతో అతడు జియో సినిమాలో కామెంట్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.