భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కూడా బాలీవుడ్ హీరోయిన్ల (Bollywood) తో ప్రేమాయణం నడిపాడు. ధోనీ, సాక్షి సింగ్ (Sakshi Dhoni) లు 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు అతడిపై పలు డేటింగ్ రూమర్స్ వెల్లువెత్తాయి. చాలా మంది హీరోయిన్స్ తో మనోడు డేటింగ్ చేశాడన్న వార్తలు హల్ చల్ చేశాయ్.
ధోనితో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్ల గడిచిపోయినా… ఆ విషయం తనను వెంటాడుతూనే ఉందని పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏదైనా విషయంపై చర్చ జరిగినప్పుడు.. తన గురించి ప్రస్తావిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు పెళ్లై, పిల్లలు కలిగి వారు పెద్దైన తర్వాత కూడా ధోనితో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమో అని వాపోయింది.
ఏడాది పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోని తర్వాత తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని… అయినా తానెప్పుడూ బాధపడలేదని వెల్లడించింది. హ్యాపీగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాను అని రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది.
లక్ష్మీరాయ్ తో పాటు బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సంచలనంగా మారిన దీపికా పదుకునే పైన కూడా ధోనీ ఎంతో ఆసక్తి కనబర్చాడు. వీరిద్దరు కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు హల్ చల్ చేశాయ్. అయితే అదే సమయంలో యువరాజ్ కూడా సీన్ లోకి ఎంటరయి దీపిక ను తనవైపు ఎట్రాక్ట్ చేసుకున్నాడని, దీంతో ధోనీ పక్కకు తప్పుకున్నాడని చెప్పుకుంటారు.