సౌతాఫ్రికా టూర్లో టీమిండియా (Team India) టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఒక సీనియర్ ప్లేయర్‌గా జట్టుకు అందుబాటులో ఉంటానని.. ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇప్పుడంటే కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు కాబట్టి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
వన్డే కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని... కెప్టెన్‌గా తప్పుకోవద్దంటూ గంగూలీ తనను అడగలేదంటూ కోహ్లి కుండబద్దలు కొట్టాడు. దీంతో బీసీసీఐకి, కోహ్లికి.. పరోక్షంగా గంగూలీతో వివాదం తారాస్థాయికి చేరిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో భారత మాజీ క్రికెటర్లు జోక్యం చేసుకొని .. కోహ్లి ఆటపై దృష్టి పెట్టాలని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది.
గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్నాడు. ఆ సమయంలో విరాట్‌తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు.