ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లకు 267 పరుగులు చేసింది. కరుణరత్నే కాకుండా ధనంజయ్ డిసిల్వా 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాతుమ్ నిశాంక కూడా 56 పరుగులు చేశాడు. (AFP)