నాకు వారితో గొడవలా? అలాంటి పిచ్చి రాతలు మానేయాలి: పీవీ సింధు
నాకు వారితో గొడవలా? అలాంటి పిచ్చి రాతలు మానేయాలి: పీవీ సింధు
ఒలింపిక్స్ జాతీయ శిక్షణా శిబిరం తను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను పీవీ సింధు ఖండించారు. శిక్షణా శిబిరం నుంచి వైదొలిగి తను లండన్ వెళ్లినట్లు వచ్చిన ఓ వార్త కథనంపై ఆమె మండిపడ్డారు
ఒలింపిక్స్ జాతీయ శిక్షణా శిబిరం తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను పీవీ సింధు ఖండించారు. శిక్షణా శిబిరం నుంచి వైదొలిగి తను లండన్ వెళ్లినట్లు వచ్చిన ఓ వార్త కథనంపై ఆమె మండిపడ్డారు
2/ 5
రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయంపై స్పందిస్తూ .. కోచ్ పుల్లెల గోపీచంద్,తన తల్లిదండ్రులతో ఎలాంటి విభేధాలు లేవని స్పష్టం చేశారు.
3/ 5
న్యూట్రిషియన్, రికవరీ అవసరాల కోసం మాత్రం లండన్ వెళ్ళినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్‌తో సిందుకు విభేదాలు వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.
4/ 5
"ఫిట్నెస్ సాధించడం కోసం నేను లండన్‌కు వచ్చాను. నా తల్లి దండ్రుల సూచనతో జీఎస్‌ఎస్‌ఐ (గ్యాటోరేడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్)లో ఫిట్‌నెస్‌పై శిక్షణ తీసుకుంటున్నాను. వారితో నాకు ఎలాంటి విభేదాలూ లేవు.
5/ 5
నా కోసం కష్టపడుతున్నా వారితో నాకెందుకు సమస్యలు ఉంటాయి. కోచ్ గోపీచంద్‌తో కూడా ఎలాంటి సమస్యలు లేవు. ఇలాంటి ఆసత్య వార్తలు రాసే రిసోర్టర్ అలాంటివి రాయకుండా ఆపేయాలి" అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది.