తొలిసారిగా ఐపీఎల్ లీగ్‌లో నమీబియా, ఐర్లాండ్‌కు చెందిన ప్లేయర్స్ తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఐపీఎల్ కాంట్రాక్టు లేని ఏకైక టెస్ట్ హోదా కలిగిన దేశం పాకిస్థాన్. కొన్ని కారణాల వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అనుమతి లేదు. అయితే 2023లో ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో ఉన్న 243 మంది ఆటగాళ్లలో ముగ్గురు పాకిస్థానీ మూలాలున్న ప్లేయర్స్ ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.
* సికందర్ రజా(Sikandar Raza) : సికందర్ రజా పాకిస్థాన్‌లోని సియాల్కోట్ నగరంలో జన్మించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సికిందర్ రాజా తొలిసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. ఈ జింబాబ్వే జట్టు ఆల్ రౌండర్‌ను రూ.50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఫినిషర్, ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాత్రను రజా పోషించే అవకాశం ఉంది.
టీ20 క్రికెట్లో సికందర్ రజా గణాంకాలు పరిశీలిస్తే.. అతను మొత్తం 158 మ్యాచ్‌లు ఆడాడు. 129.81 స్ట్రైక్ రేట్‌తో 3,109 పరుగులు చేశాడు. అతను 19 టీ20 అర్ధశతకాలు సాధించాడు. బౌలింగ్ విభాగంలో రజా 7.34 ఎకానమీ రేటుతో 79 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/8 కావడం గమనార్హం. రజా గతంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, మజాన్సీ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో ఆడాడు. తొలి ఐపీఎల్ సీజన్లో అతను ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
* మొయిన్ అలీ(Moeen Ali) : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా పాకిస్థాన్‌కు చెందినవాడు. ఈ స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్ IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున ఆడనున్నాడు. అతన్ని IPL 2022 మెగా వేలానికి ముందు CSK ఉంచుకుంది. 2023 సీజన్లో అతని కాంట్రాక్ట్ కొనసాగించాలని నిర్ణయించుకుంది. చాలా సందర్భాల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై ఫ్రాంచైజీకి అలీ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. అతను స్పిన్ విభాగంలో తన ఉనికిని చాటుకుంటూనే జట్టు కోసం కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. IPL 2023లో CSK టీమ్‌లో ఆల్ రౌండర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.