టీమిండియా (Team India) యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మంచి జోరు మీదున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే తగ్గేదే లే అన్నట్లు బ్యాట్ తో శివతాండవం చేస్తున్నాడు. శ్రీలంకతో తొలుత జరిగిన టి20 సిరీస్ మూడు మ్యాచ్ ల్లోనూ వరుస పెట్టి అజేయ అర్ధ సెంచరీలు సాధించిన అతడు... టెస్టు సిరీస్ లోనూ దుమ్ము రేపాడు.
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (80 పరుగులు) సహా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు అయ్యర్. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మూడు మ్యూచ్ల్లోనూ 57, 74, 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ కి ఈ ఏడాది సూపర్ గా కలిసివచ్చినట్టు ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.