సానియా మీర్జా (Sania Mirza), షోయబ్ మాలిక్ (Shoaib Malik) సెలబ్రిటీ స్టార్ కపుల్. వీరి ప్రేమ దేశాలు దాటి సరిహద్దులు దాటి గెలిచింది. 2010లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ప్రమాదంలో పడింది అన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
విడాకులు గురించి వార్తలు వస్తున్నా.. ఈ ఇద్దరూ సైలెంట్ గా ఉండటంతో నిజమే అన్న సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా చేసిన పోస్ట్లు, పరోక్ష వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యాన్ని పోశాయి. అయితే, వాళ్లిద్దరూ విడిపోయారని.. అందుకే సంబంధించిన పనులన్నీ పూర్తిపోయినట్టు తెలుస్తోంది.