ఈ క్రమంలో టీమిండియా తరఫున చాలా మంది ప్లేయర్లు ఆడారు. అర్ష్ దీప్ సింగ్ లాంటి వాళ్లు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో పాతుకుపోయారు. ఫామ్ లో లేని కోహ్లీ మళ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. బీసీసీఐలో పాతుకుపోతాడనుకున్న సౌరవ్ గంగూలీ అధ్యక్ష పదవిని కోల్పోయాడు. సెలెక్షన్ కమిటీ రద్దు అయ్యింది.
పంత్‌లో ఈ సామర్థ్యాలు ఉండటంతోనే వరుసగా విఫలమవుతున్నా.. టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశాడు. శిఖర్ మాట్లాడుతూ.. 'ఇంగ్లండ్‌లో రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన ఏ ఆటగాడికైనా జట్టు నుంచి మద్దతు లభిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే రిషభ్ పంత్ ఓ మ్యాచ్ విన్నర్. అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
అయితే, ఈ ఏడాది లెక్కలు వేరే కథ చెబుతున్నాయి. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 12 వన్డేల్లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 37.33 యావరేజ్‌తో 336 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలున్నాయి. తాజా న్యూజిలాండ్ పర్యటనలో పంత్ 15, 10 పరుగులతో విఫలమయ్యాడు.