అయితే ప్రస్తుతం ఆయేషా తన ఇమేజ్, కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరిస్తోందని ధావన్ కోర్టును ఆశ్రయించాడు. ఆమెపై ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ CEO, ధీరజ్ మల్హోత్రాకు కూడా తన పరువు తీసేలా ఉన్నా మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసిందని ధావన్ పేర్కొన్నాడు. (PC : Instagram)
* ఆయేషాకు కోర్టు ఆదేశాలు : ధావన్‌కు పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేయకూడదని ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సూచించింది. ధావన్‌తో ముఖర్జీకి నిజమైన సమస్యలు ఉంటే, సంబంధిత అధికారులను సంప్రదించడంలో ఆమెపై ఎలాంటి ఆంక్షలు విధించలేమని న్యాయమూర్తి హరీష్ కుమార్ అన్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా, ధావన్ పరువు తీసేలా ఆమె వ్యవహరించకూడదని చెప్పారు. (PC : Instagram)
* ఇప్పటికే పలువురికి మెజేస్‌లు పంపిన ఆయేషా? : ధావన్ తరఫు న్యాయవాది అమన్ హింగోరానీ మాట్లాడుతూ.. ఆయేషా తన సన్నిహితులు, పరిచయస్తులతో పాటు క్రికెట్ అధికారులకు కూడా ధావన్ పరువుకు భంగం కలిగించే మెసేజ్‌లను పంపుతోందని చెప్పారు. ఆమె మనుగడ కోసం ధావన్ నుంచి ఎటువంటి డబ్బు తీసుకోలేదని, కానీ తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్ నుంచి డబ్బు తీసుకోవలసి వచ్చిందని కూడా తెలిపారు. స్కూల్ ఫీజులు, మార్టగేజెస్కు ధావన్ నెలకు 17,500 ఆస్ట్రేలియన్ డాలర్లు(దాదాపు రూ.10 లక్షలు) చెల్లిస్తున్నాడని పేర్కొన్నారు. (PC : Instagram)
ఆయేషా ముఖర్జీ ప్రాథమికంగా ఆంగ్లో-ఇండియన్. బ్రిటిష్ సంతతికి చెందిన తల్లి, ఇండియాకు చెందిన తండ్రికి జన్మించింది. అయేషా పుట్టిన తర్వాత ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆయేషా ప్రస్తుతం మెల్బోర్న్లో ఉంటోంది. శిఖర్ ధావన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమెకు ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. (PC : Instagram)
వీరికి అలియా, రియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మెల్బోర్న్లో ఉన్న ఆయేషా మాజీ కిక్బాక్సర్. ఆమె తన కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కూడా ఆడింది. శిఖర్ ధావన్‌కు ఆమె ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా పెళ్లి వరకు వచ్చింది. వీరిద్దరికి హర్భజన్ సింగ్ మ్యూచువల్ ఫ్రెండ్. (PC : Instagram)