2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్లో అదరగొట్టి తన ప్లేస్‌ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు.