ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన కెరీర్లో 17 పారాలింపిక్స్ స్వర్ణ పతకాలు గెలిచి రికార్డు సృష్టించింది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన సారా స్టోరే తొలి సారిగా 1992లో జరిగిన బార్సిలోనాలో స్విమ్మర్‌గా తొలి పారాలింపిక్స్ ఆడింది. పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకాల వేట మొదలు పెట్టింది. ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి సైక్లింగ్లోపాల్గొంటున్నది. అలా స్విమ్మర్ కాస్తా సైక్లిస్టు అయ్యింది. అయినా ఆమె పతకాల వేట ఆగిపోలేదు.