సారా సోషల్ మీడియాలో తన ఫోటో పెట్టిందంటే చాలు అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్స్‌తో రెచ్చిపోతారు. బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్‌తో మెరిసిపోయే సారా టెండూల్కర్, డ్రెస్సింగ్ విషయంలోనూ వారి ట్రెండ్‌నే ఫాలో అవుతూ ఉంటుంది. దీంతో సారా గురించిన విషయాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అన్వేషిస్తుంటారు.
అయితే అచ్చం అలాంటి ప్రదేశాల్లోనే గిల్ కూడా ఫోటోలు దిగి షేర్ చేశాడు. అంతేకాకుండా సారా మాల్దీవులకు వెళ్తే, శుభ్‌మన్ గిల్ కూడా మాల్దీవుల్లో ఓ హోటల్లో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేశాడు. గిల్ కూడా నూతన సంవత్సర వేడుకలను గోవాలోనే జరుపుకున్నాడు. ఇంకేముంది సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ మళ్లీ కలిసి పోయారని నెట్టిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.