Sanju Samson : సంజూ సామ్సన్ అభిమానులకు పిడుగు లాంటి వార్త.. టీమిండియాకు గుడ్ బై చెప్పబోతున్నాడా?
Sanju Samson : సంజూ సామ్సన్ అభిమానులకు పిడుగు లాంటి వార్త.. టీమిండియాకు గుడ్ బై చెప్పబోతున్నాడా?
Sanju Samson : టి20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన సంజూ సామ్సన్ కు ఒకే ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఇక బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు.
నిలకడగా ఆడుతున్నా టీమిండియా (Team India)లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు సంజూ సామ్సన్ (Sanju Samson). ఒక మ్యాచ్ లో ఆడితే ఆ తర్వాతి మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం అవుతున్నాడు.
2/ 7
టి20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన సంజూ సామ్సన్ కు ఒకే ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఇక బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు.
3/ 7
మరో పక్క సంజూ సామ్సన్ కంటే పేలవంగా ఆడుతున్న రిషభ్ పంత్.. కేఎల్ రాహుల్ లు వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. బీసీసీఐ కుళ్లు రాజకీయాలతో సంజూ సామ్సన్ కెరీర్ ను నాశనం చేస్తుందంటూ అతడి అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
4/ 7
ఇక తాజాగా సంజూ సామ్సన్ పై ఒక వార్త చక్కర్లు కొడుతుంది. తమ దేశం తరఫున ఆడాలంటూ ఐర్లాండ్ క్రికెట్ బోర్డు సంజూ సామ్సన్ కు ఆఫర్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
5/ 7
టీమిండియాకు గుడ్ బై చెప్పి ఐర్లాండ్ కు రావాలని.. అలా చేస్తే మూడు ఫార్మాట్లలోనూ సంజూ సామ్సన్ కు ఆడే అవకాశం ఇస్తామని కూడా ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
6/ 7
అయితే అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది. సంజూ సామ్సన్ కు తాము ఎలాంటి ఆఫర్ ను ఇవ్వలేదని ఐర్లాండ్ క్రకెట్ బోర్డు వివరణ ఇచ్చుకుంది.
7/ 7
తమ దేశం తరఫున ఆడే అవకాశం రాని చాలా మంది క్రికెటర్లు వేరే దేశాలకు వలస వెళ్లి ఆ దేశం తరఫున క్రికెట్ ఆడటం చూస్తూనే ఉంటాం. అండర్ 19 టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన ఉన్ముక్ చంద్ ప్రస్తుతం అమెరికా తరఫున ఆడుతున్నాడు.