సంజూ సామ్సన్ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే 2011 మనోజ్ తివారి ఉదంతం గుర్తుకు రాక మానదు. డిసెంబర్ 11, 2011లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో మనోజ్ తివారి సెంచరీ (104) పరుగులతో రాణించాడు. సెంచరీ కొట్టిన తర్వాత కూడా మనోజ్ తివారి మరో అంతర్జాతీయ వన్డే ఆడేందుకు ఏడు నెలల పాటు ఆగాల్సి వచ్చింది.
విండీస్ పై సెంచరీ చేసిన తర్వాత వరుసగా 10 మ్యాచ్ లకు అతడు బెంచ్ పైనే కూర్చోవలసి వచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ తివారి కూడా స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు సంజూ సామ్సన్ పరిస్థితి కూడా మనోజ్ తివారిలానే ఉంది. ట్యాలెంట్ ఉన్నా బెంచ్ కే పరిమితం అవుతూ చివరకు కారణం లేకుండా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యేలా ఉన్నాడు.