2005లో హైదరాబాద్ వేదికగా జరిగిన డబ్ల్యూటీఏ వరల్డ్ టైటిల్‌ను గెలిచి మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మహిళల విభాగంలో 27వ ర్యాంక్‌ను అందుకొని అందరి చేత శభాష్ అని కూడా అనిపించుకుంది. అయితే మణికట్టు గాయం ఆమె సింగిల్స్ కెరీర్‌ను నాశనం చేసింది.
అనంతరం డబుల్స్ (మిక్స్‌డ్‌తో కలిపి)లో మెరిసి ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గింది. ఆఖరిసారిగా 2023 ఆస్ట్రేలియా ఓపెన్ లో బరిలోకి దిగింది. డబుల్స్ లో రెండో రౌండ్ లోనే వెనుదిరిగినా.. మిక్స్ డ్ డుబుల్స్ మాత్రం ఫైనల్ వరకు చేరుకుంది. తుది మెట్టుపై బోల్తా పడి రన్నరప్ గా నిలిచింది. అయితే ఆమె ఆటతో పాటు వివాదాలతోనూ సావాసం చేసింది. నిజాయితీగా చెప్పాలంటే వాటితోనే మరింత పాపులర్ అయ్యింది. ఆమె జీవితంలోని కొన్ని కాంట్రవర్సీలు...
టెన్నిస్ క్రీడ అంటేనే గ్లామరస్ ఆట... మహిళలు స్కర్ట్లు వేసుకొని బరిలోకి దిగుతారు. సానియా మీర్జా కూడా అందరిలాగే స్కర్ట్లు వేసుకొని బరిలోకి దిగగా...ఇది నచ్చని ముస్లిం మత పెద్దలు ఫత్వా కూడా జారీ చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోని సానియా... తన ఆటతో దేశం గర్వపడేలా చేసింది. 2005లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ వరకు చేరి సత్తా చాటింది.
ఒక రకంగా చెప్పాలంటే సానియా మీర్జా ఎదుర్కొన్న అతి పెద్ద వివాదం ఇదే. 2008లో టెన్నిస్ మ్యాచ్‌ను చూస్తూ తన కాళ్లను ఎదురుగా ఉన్న టేబుల్‌పై ఉంచింది. అదే టేబుల్‌పై భారత జాతీయ పతాకం ఉండగా... ఆమె కాళ్లు ఆ పతాకాన్ని తాకుతున్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ సింగ్ ఠాకూర్ కోర్టులో కేసు కూడా వేశారు. (PC : TWITTER)
2009లో సానియా మీర్జాకు చిన్ననాటి స్నేహితుడు షోరబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం లైవ్ రైట్స్‌ను ఒక మీడియాకు అమ్మడం అప్పట్లో సంచలనం. అయితే ఈ ఎంగేజ్మెంట్ ఎంతో కాలం నిలువలేదు. ఆరు నెలల తర్వాత వీరు విడిపోతున్నట్లు ప్రకటించి మరో చర్చకు ఈ జంట నాంది పలికింది. (PC : TWITTER)
2012లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సానియా మీర్జా మరో వివాదానికి కేంద్ర బిందువైంది.అసలే 2009 నవంబర్‌లో ముంబై దాడులు జరగడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయం అది. ఆ సమయంలో ఆమె పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం భారతీయులకు నచ్చలేదు. ఆమెను దేశ ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. సానియా మాత్రమే భారత దేశం నా మాతృ భూమి... భారతీయులంతా నా సహోదరులు అనే ప్రతిజ్ఞను పాటించిందంటూ వ్యంగ్యంగా విమర్శలు కూడా చేశారు. వీటితో పాటు మసీద్‌లో కాబోయే వరుడు మాలిక్‌తో కలిసి ఫోటోలు దిగడం వంటివి ఆమెను నిత్యం వివాదాలతో సావాసం చేసేలా చేశాయి. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితంపైనా అనేక పుకార్లు వస్తున్నాయి. ఏదీ ఏమైనా 17 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ 2023 ఆస్ట్రేలియా ఓపెన్ తో ముగిసింది. (PC : TWITTER)