భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడిపోయారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. ఇక, లేటెస్ట్ గా సానియా మరో షాకింగ్ పోస్ట్ చేసింది (Sania Mirza/Instagram)
సానియా మీర్జా మనిషిగా ఉండటం గురించి మరియు పరిస్థితులు చెడిపోయినప్పుడు మరియు దానిని అధిగమించడానికి ఎలా విరామం ఇవ్వాలి అనే దాని గురించి కొన్ని విషయాలను ఈ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. సానియా పోస్ట్‌లో “మీరు మనిషి.. వెలుతురు మరియు చీకటి అనేది కామన్. సాధారణంగా ఉండటానికి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గుండె అత్యంత భారంగా అనిపించే రోజుల్లో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి." అంటూ భావోద్వేగంగా ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. (Sania Mirza/Instagram)
సానియా మీర్జా ఈ పోస్ట్ చేయడంతో కచ్చితంగా షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకోనుందని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2018లో కుమారుడు జన్మించాడు. (Sania Mirza/Instagram)
కొద్ది రోజుల క్రితం తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో సానియా మీర్జా (sania mirza news) పెట్టిన ఓ పోస్ట్ వల్ల విడాకుల వార్తలు హల్చల్ చేశాయి. ‘ముక్కలయిన హృదయం ఎక్కడకు వెళుతుంది. అల్లాను అన్వేషిస్తుంది’ అని ఇన్‌స్టాగ్రాంలో సానియా మీర్జా పెట్టిన పోస్ట్ (Sania Mirza Instagram Post) విడాకుల ప్రచారానికి తావిచ్చింది.(Sania Mirza/Instagram)