ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాకు ఆట మీద ఎంత ప్రేముందో...చెల్లెలు ఆనమ్ మీర్జా అన్నా అంతే ప్రాణం. తనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా చెల్లి ఆనమ్నే బెస్ట్ ఫ్రెండ్ అని సానియా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది. తల్లి కాబోతున్న సానియా ప్రస్తుతం ఇంట్లో చెల్లెలితో కలిసి అల్లరి చేస్తోంది. సోషల్ మీడియాలో సానియా పోస్ట్ చేసే ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. ఆనమ్తో ఉంటే తనకు సమయమే తెలియదని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంది.