పీవీ సింధుకు రెండో ‘సారి’... ఛాంపియన్‌షిప్ నిలుపుకున్న సైనా నెహ్వాల్...

పీవీ సింధు అంతర్జాతీయ వేదికల మీద ఎన్ని విజయాలు సాధిస్తున్నా... నేషనల్ ఈవెంట్స్ వచ్చేసరికి మాత్రం సైనాదే పైచెయ్యి అవుతోంది. గత ఏడాది నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న స్టార్ ప్లేయర్ పీవీ సింధుని చిత్తు చేసి... టైటిల్ సాధించిన సైనా నెహ్వాల్ ఈసారి హిస్టరీ రిపీట్ చేసింది. వరుసగా రెండో ఏడాది ఫైనల్స్‌లో తలబడిన సింధు, సైనా పోరులో సీనియర్ ప్లేయర్‌కు విజయం లభించింది. సింధు మీద పూర్తి ఆధిపత్యం కనబర్చిన సైనా నెహ్వాల్ కేవలం అరగంటలోనే ఫైనల్ మ్యాచ్‌ను ముగించింది.