అవును మైదానంలో సచిన్ కు ప్రత్యర్థులపై విరుచుకుపడటం అంటే ఎంతటి సరదానో.. అదే సమయంలో రోడ్లపై మెరుపు వేగంతో దూసుకెళ్లడమన్నా ఇష్టం. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ అనేక లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. అయితే ఎన్ని కార్లు కొనుగోలు చేసినా సచిన్ కు తాను కొన్న తొలి కారు అంటే ఎనలేని ప్రేమ. సచిన్ టెండూల్కర్ 1989లో ఈ కారును కొనుగోలు చేశాడు. (File pic)
సచిన్ టెండూల్కర్ కు మామూలు అభిమానులే కాదు.. సెలబ్రిటీ అభిమానులు కూడా ఉన్నాడు. సచిన్ ఆట అంటే రేసింగ్ దిగ్గజం మైకేల్ షూమాకర్ కు చాలా ఇష్టం. ఈ జర్మనీ డ్రైవర్ ఫార్ములా వన్ హీరో. రికార్డు స్థాయిలో 7 సార్లు డ్రైవర్ చాంపియన్ షిప్ ను గెల్చుకున్నాడు. ఇక షూమాకర్ ను ఫెరారీని విడదీసి చూడలేము. 2002లో సర్ డాన్ బ్రాడ్ మన్ 29 టెస్టు సెంచరీల రికార్డును సచిన్ టెండూల్కర్ సమం చేశాడు. దీనికి గుర్తుగా షూమాకర్ సచిన్ కు ఫెరారీ 360 మోడెనా కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర అప్పుడు దాదాపు 1,38,000 అమెరికన్ డాలర్లు. అంటే అప్పుడు రూపాయి మారకంతో పోలిస్తే రూ. 60 లక్షలకు పైమాటే. 2002లో 60 లక్షల కారు అంటే మాటలు కాదు కదా.. కొన్ని సంవత్సరాల పాటు దీన్ని తనతోనే ఉంచుకున్న సచిన్ ఆ తర్వాత సూరత్ వ్యాపారవేత్తకు అమ్మేశాడు. (Image: Team-BHP)