SA20 : ధోని టీం ఎక్కడైనా సూపర్ కింగ్సే.. అరంగేట్రంలోనే సెమీస్ చేరిందిగా..
SA20 : ధోని టీం ఎక్కడైనా సూపర్ కింగ్సే.. అరంగేట్రంలోనే సెమీస్ చేరిందిగా..
SA20 : ఆరంభంలో టోర్నీని నెమ్మదిగా ఆరంభించిన జొహన్నెస్ బర్గ్ టీం ఆ తర్వాత రెచ్చిపోయింది. వరుసగా విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ కు చేరుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని టీం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరగుతున్న సౌతాఫ్రికా టి20 (SA20)లీగ్ లో జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ (Johannesburg Super Kings) సెమీఫైనల్ కు చేరుకుంది. జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ ను ధోని టీం అయిన చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సొంతం చేసుకుంది.
2/ 7
ఆరంభంలో టోర్నీని నెమ్మదిగా ఆరంభించిన జొహన్నెస్ బర్గ్ టీం ఆ తర్వాత రెచ్చిపోయింది. వరుసగా విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ కు చేరుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని టీం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
3/ 7
ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు 3 పరాజయాలతో మొత్తంగా 22 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులోనూ నెగ్గి సెమీస్ లో మరింత ఆత్మ విశ్వాసంతో అడుగుపెట్టాలనే ఉద్దేశంలో జొహన్నెస్ బర్గ్ టీం ఉంది.
4/ 7
ఆదివారం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తో జరిగిన కీలక పోరులో డుప్లెసిస్ అదరగొట్టాడు. స్లో వికెట్ పై సమయానికి తగ్గట్లు ఆడిన అతడు 61 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
5/ 7
అయితే త్రుటిలో శతకాన్ని కోల్పోయాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (40)తో కలిసి తొలి వికెట్ కు 119 పరుగులు జోడించాడు. అయితే ఇక్కడి నుంచి జోహన్నెస్ బర్గ్ వరుసగా వికెట్లను కోల్పోయింది.
6/ 7
దాంతో 200 స్కోరు చేస్తుందనుకున్న చోట 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది.
7/ 7
తెంబా బువుమా (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మార్కరమ్ (34) మినహ మిగిలిన ప్లేయర్లు నిరాశ పరిచారు. జొహన్నెస్ బర్గ్ తన ఆఖరి పోరును సోమవారం ఎంఐ కేప్ టౌన్ తో ఆడనుంది.