దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ (SA20 2023) తొలి ఎడిషన్ లో భాగంగా గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. మార్కరమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape)తో జొహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ (Johannesburg Super Kings) జట్టు రెండో సెమీస్ లో తలపడనుంది. (PC : Sunrisers Eastern Cape)
తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో జొహన్నెస్ బర్గ్ చేతిలో ఈస్టర్న్ కేప్ ఓడింది. జొహన్నెస్ బర్గ్ కెప్టెన్ గా ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక అదే సమయంలో ఈస్టర్న్ కేప్ లో మార్కరమ్ తో పాటు బవుమా, స్మట్స్, యాన్సెన్ లు మంచి టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగే సెమీస్ పోరు అభిమానులను అలరించడం ఖాయంలా కనిపిస్తుంది.